సూపర్ స్టార్ మహేష్ కెరీర్ పరంగా ప్రస్తుతం నటిస్తున్న 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. తన కెరీర్ పరంగా ఇప్పటివరకు అపజయం ఎరుగని టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక తమ సినిమా ప్రోగ్రెస్ గురించి దర్శకులు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియచేసారు.
ప్రస్తుతం మా సరిలేరు నీకెవ్వరు సినిమా రెండవ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది, రేపు థియేటర్స్ లో సినిమా చూసే ప్రేక్షకుల కోసం ఒక అద్బుతమైన ట్రైన్ ఎపిసోడ్ సిద్ధమవుతోంది. రాబోయే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుండి మరొక ఎంటర్టైనర్ ను వీక్షించడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆయన తన పోస్ట్ ద్వారా తెల్పడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు…!!