ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘సాహో’. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, టి.సిరీస్ పతాకంపై వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలనేని నిర్మిస్తుండగా తనిష్క్ బాగ్చి సంగీతాన్ని, జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, మురళి శర్మ, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, ఎవెలిన్ శర్మ, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. అంతేకాక ఈ సినిమా నుండి విడుదలైన సైకో సయ్యా సాంగ్ కూడా యూత్ ని ఎంతో అలరిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలోని రెండవ సాంగ్ ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో దర్శకుడు సుజీత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు దర్శకుడు సుజీత్.
ప్రభాస్‌తో మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్?
– ప్రభాస్‌గారితో నాకు మూవీ ఎక్స్‌పీరియన్స్ కంటే పర్సనల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయనతో నేను పర్సనల్‌గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. దాంతో ఒక స్టార్ తో కాకుండ మంచి ఫ్రెండ్‌తో వర్క్ చేస్తున్నాను అనుకొని వర్క్ చేశాను. అందువల్ల నాకు సినిమా చేసేటప్పుడు పెద్దగా కష్టం అనిపించలేదు.
బాహుబలి తర్వాత వస్తోన్న మూవీ కదా! మరి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి కదా?
– `సాహో` సినిమాని బాహుబలితో కంపేర్ చెయ్యలేము. బాహుబలి బిగినింగ్ జరుగుతున్నప్పుడు `సాహో` కథ చెప్పడం జరిగింది. ఆయన నేను కథ చెప్పే విధానం నచ్చి నేను హ్యాండిల్ చెయ్యగలనన్న నమ్మకంతో ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమా చేశారు.
మీ టీమ్‌లో అందరూ మీకన్నా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ కదా వారితో వర్క్ చేపించడం ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా?
– అంతా కేవలం నమ్మకం మీదే జరిగింది. నేను కథను నమ్మాను. వారు నన్ను నమ్మారు. దాంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. వారందరి సహాకారంతోనే ఈ సినిమాకు బెస్ట్ ఔట్‌పుట్ వచ్చింది.
బాహుబలి విజయం తర్వాత కథలో ఏమైనా మార్పులు చేశారా?
– సాహోకి బాహుబలి విజయంతో సంబంధం లేదు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథలో ఎలాంటి మార్పులు చెయ్యలేదు. ఈ కథకి ఎంత వరకు అవసరమో అంతవరకే చేశాము తప్ప బాహుబలి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ మార్పు చేయలేదు.
ప్రజంట్ సినిమా ప్రోగ్రెస్ ఏంటి?
– ప్రోగ్రెస్ చాలా బాగుంది. సినిమాకు సంభందించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి.
సాహో చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా! దర్శకుడిగా మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
– ఈ సినిమా షెడ్యూల్ అంతా ఎక్కువగా ఫారెన్‌లో జరిగింది. అక్కడ ప్రతిదీ పర్మిషన్స్‌తో సంబంధం కాబట్టి కాస్త పేపర్ వర్క్ ఎక్కువ చెయ్యాల్సి వచ్చింది. కొన్ని సవాళ్లు ఎదుర్కున్నప్పటికి ఔట్‌పుట్ పట్ల సంతృప్తిగా ఉన్నాం.
రొమాంటిక్ మూడ్‌లో సాగే సాంగ్‌లా ఉంది. కథలో లవ్‌స్టోరికి ఎంత ప్రాధాన్యం ఉంటుంది?
– లవ్‌స్టోరి అనేది ఈ సినిమాలో కృషియల్ పార్ట్. ఈ సాంగ్ మూవీ కి చాలా బాగా ఉపయోగపడింది. కథను డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఈ చిత్రంలో మొత్తం 4 పాటలున్నాయి. అందులో ఇప్పుడు విడుదల చేసిన సాంగ్ మాత్రమే కాస్త రొమాంటిక్ మూడ్ లో ఉంటుంది.
ఈ సినిమాలో లవ్ ప్రభాస్ సరసన శ్రద్దనే ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏదయినా ఉందా?
– ఈ కథలో ప్రభాస్ కి జోడిగా ఎవరు అయితే బాగుంటారు అని అనుకున్నప్పుడు శ్రద్ధ మాకు రైట్ ఛాయస్ అనిపించింది. మేము వెళ్లి కథ చెప్పగానే లక్కీ గా ఆమెకు నచ్చడంతో ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయింది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.
వీడియో గేమ్ కాన్సెప్ట్ ఎవరిది?
– ఇది యాక్షన్ స్కేల్ ఆఫ్ మూవీ కాబట్టి ప్రేక్షకులు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. అలాగే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఈ సినిమాకు సంభందించి ఏదయినా ఉందా అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో గేమ్ కాన్సెప్ట్ అనుకున్నాం.
మూవీ మేకింగ్ ఎలా ఉండబోతుంది?
– సాహో టీజర్ మీ అందరికీనచ్చే ఉంటుంది. బాలీవుడ్, ఇంటర్‌నేషనల్ సినిమాలా దీన్ని తెరకెక్కించాలని ట్రై చెయ్యలేదు. కాకపోతే ప్రేక్షకులకు కాస్త కొత్తగా చూపించాలనుకున్నాం. మేము ఏదయితే అనుకున్నామో దాన్నిఎగ్జాక్ట్ గా రీచ్ అవ్వగలిగామనే అనుకుంటున్నాను. మిగతాది సినిమా చూసి మీరే చెప్పాలి.
వేరు వేరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేపించుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
– ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక్కోటి ఒక్కోథీమ్ ఉంటుంది. మ్యూజిక్ వేరే వేరే వాళ్ళు ఇస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో వేరు వేరు మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ఎంచుకోవడం జరిగింది. వాళ్ళ బెస్ట్ ఇవ్వడం జరిగింది.
మీరు ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టారు కదా? ఎలా అనిపిస్తోంది.
– నా ఫస్ట్ మూవీ రిలీజయ్యి నిన్నటితో ఐదు సంవత్సరాలు అయింది. ఆ సినిమా తీసేటప్పుడు ఈ విషయం నాకు తెలీదు. ఈ సినిమా చాలా పెద్దది కాబట్టి నేను ఐదేళ్ళయినా వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్ ప్రాసెస్ ని కూడా నేను ఎంజాయ్ చేశాను.
బడ్జెట్ విషయం లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
– ఈ మూవీ బడ్జెట్ కంట్రోల్ మేము ప్రీ ప్రొడక్షన్ డేస్ ని తగ్గించడం ద్వారా చేశాము. అలాగే అనవసర విషయాల జోలికి పోకుండా కథకు ఏది అవసరమో అదే చేయడం ద్వారా బడ్జెట్ ని కంట్రోల్ చేయగలిగాము. ఈ సినిమా ప్రభాస్‌గారి ఇమేజ్, బాహుబలి ఇమేజ్ అనేమిలేదు కథకు తగ్గట్టుగానే తెరకెక్కించాం.
ప్రభాస్ గురించి చెప్పండి?
– ప్రభాస్ చాలా సూపర్బ్ పర్సన్. ఆయనంటే పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన కోసం ఇంత కాలం వెయిట్ చేశాను.
సోషల్ మీడియాలో మిమ్మల్ని శంకర్, రాజమౌళి తో పోలుస్తున్నారు కదా?
– శంకర్, రాజమౌళి లాంటి గొప్ప దర్శకులతో నన్ను పోల్చకండి. శంకర్ గారి సాంగ్స్ మేకింగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ని ఆయనలా తీయడానికి ప్రయత్నించాను. అది త్వరలోనే విడుదలవుతుంది.
అనంతరం పాటల రచయిత క్రిష్ణకాంత్ మాట్లాడుతూ… ఇంత పెద్ద సినిమాలో నాకు మంచి పాట రాసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన యు.వి. క్రియేషన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు పాట సిట్యువేషన్ చెప్పేవారు దానికి తగ్గట్టుగానే పదాలను రాసుకున్నా“ అన్నారు.