‘డియర్ కామ్రేడ్’ విజయంతో సంతృప్తిగా ఉన్నాం – నిర్మాతలు

0
551

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుదలై హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ గా అందరి ప్రశంసలు పొందుతోంది.విడుదలైన అన్నికేంద్రాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా నిర్మాతలు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ .. విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను 21 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ లో చూసుకుంటే 30 కోట్లకు పైగా రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం విశేషం.. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలెక్షన్స్ రావడంతో బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లో గా ఉందంటూ కామెంట్స్ రావడంతో 13 నిమిషాల సినిమాను ఎడిట్ చేసాం. అలాగే ఇప్పటికే ఈ సినిమాలో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు, చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్ ని జోడించాం. ఆ పాటతో సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం” అన్నారు.

మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ – “రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్‌. , యు.కె ల్లో మంచి క‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను ‘పెళ్లిచూపులు’ తరువాత విజయ్ విని నాకు వినిపించాడు అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ రాలేదు .. ఆ తరువాత సినిమా మొదలు పెట్టాం. ‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఏ మార్పులు చేద్దాం అనుకున్నాం. కానీ చేయలేదు అప్పుడే మైత్రి నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. వారివల్ల సినిమా రేంజ్ పెరిగింది. సినిమా కాన్వాస్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే మంచి వసూళ్లు రాబట్టడం ఆనందంగా ఉంది” అన్నారు.

నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ .. కలెక్షన్స్ బాగున్నాయి. వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా తెలుగు సినిమా అయినా మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మంచి వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళ్, కన్నడ భాషలలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా తరువాత విజయ్ హీరోగా చేస్తున్న ‘హీరో’ సినిమా మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here