సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు కు నేటితో 20ఏళ్ళు …!!!

0
433

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి తనయుడిగా చిన్నతంలో బాలనటుడిగా దాసరినారాయణ రావు గారి దర్శకత్వంలో రూపొందిన ‘నీడ’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, ఆ తరువాత పలు సినిమాల్లో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకల మనసులో మంచి స్థానం సంపాదించడం జరిగింది. ఇక బాలనటుడిగా బాలచంద్రుడులో నటించిన మహేష్ బాబు, ఆపై సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

అనంతరం నటనలో కొంత శిక్షణ తీసుకున్న మహేష్ బాబు, 1999లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ‘రాజకుమారుడు’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోగా నటించిన తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ సాధించి, నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అద్భుతమైన రికార్డులు నెలకొల్పింది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక స్పెషల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రీతీ జింత కథానాయికగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. మని శర్మ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది

అప్పట్లో 42 సెంటర్స్ లో 100 రోజుల పండుగ జరుపుకున్న ఆ సినిమాకు నేటితో సక్సెఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి అవడంతో, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పలు సోషల్ మీడియా వేదికల్లో మహేష్ కు అభినందలు తెలుపుతున్నారు. మొదటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ప్రిన్స్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు, వరుసగా విజయాలు సాధిస్తూ ప్రస్తుతం సూపర్ స్టార్ స్థాయికి చేరుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే తన కెరీర్ లోని 25వ సినిమా మహర్షితో సూపర్ సక్సెస్ ని అందుకున్న మహేష్, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here