కలర్ఫుల్ విజువల్స్ తో అలరిస్తున్న రెబల్ స్టార్ సాహో ‘ఏచోట నువ్వున్నా’ వీడియో సాంగ్  ప్రోమో….!!

0
485

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స సంస్థపై నిర్మాతలు వంశీ, ప్రమోద్ అత్యంత భారీ ఖర్చుతో, తెలుగు సహా పలు ఇతర భాషల్లో నిర్మిస్తున్న మూవీ సాహో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఈ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, వ్యూస్ పరంగా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అలానే ఈ మూవీలోని ‘సైకో సయ్యా’ అనే పల్లవితో సాగె ఫస్ట్ ప్రోమో వీడియో సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా అలరించింది.

ఇక నేడు ఈ సినిమాలోని ‘ఏ చోట నువ్వున్నా’ అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ వీడియో ప్రోమోని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ తో ప్రభాస్ మరియు శ్రద్ధ కనువిందు చేసిన ఈ లవ్ సాంగ్ విజువల్స్ కూడా ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి. గురు రంధావా స్వరపరిచిన ఈ సాంగ్ ని యువ సింగర్స్ హరిచరణ్ శేషాద్రి మరియు తులసి కుమార్  ఆలపించడం జరిగింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నసాంగ్ ని ఆగష్టు 2న రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 30న ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here