డబుల్ ఇస్మార్ట్ షురూ చేయనున్న పూరి

0
573

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పెద్ద విజయం అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న జరిగిన సినిమా విజయోత్సవ వేడుక లో పూరి జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

 సినిమా ని ఇంత పెద్ద విజయం చేసిన అభిమానులకి, ప్రేక్షకులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ ఇక పై మాస్ సినిమాలు మాత్రమే తీయాలి అని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ కి వచ్చిన రెస్పాన్స్ కి పూరి జగన్ ఇక పై మాస్ సినిమాలు చేసి అందరినీ అలరించాలి అనే దృక్పథం తో ఉన్నారు. అంతే కాకుండా ఇస్మార్ట్ ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల ని కలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం లో త్వరలో విజయోత్సవ టూర్ ని ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తికరం అంశం ఏంటి అంటే పూరి జగన్ ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ పేరు తో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆ విజయోత్సవ యాత్ర ముగియగానే డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ పైన పని మొదలు పెట్టనున్నట్లు కూడా తెలిపారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here