ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సూపర్హిట్ టాక్తో టెర్రిఫిక్ ఓపెనింగ్స్ సాధించి ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి తొమ్మిది రోజుల్లోనే 63 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో….
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ – ” అందరూ నన్ను చాలా పొగుడుతున్నారు. నేనుఇన్నేళ్ల నా కెరీర్ లో ఫస్ట్ టైం ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఈ సినిమా తీశాను. మీ అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ అందరి బ్లడ్ లోకి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు, డైలాగ్స్ సెన్సేషన్ అయ్యాయి. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. అలాగే నన్ను అభినందించిన డార్లింగ్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, చరణ్ ,బాలకృష్ణ గారు ఈ రోజే సినిమా చూస్తున్నారు..అఖిల్, రానా, సుమంత్, ఇలా ప్రతి ఒక్కరికి థాంక్స్. ఈ మధ్య కాలం లో ఎవరు నాకు ఫోన్ చేసి అభినందించలేదు. నేను బ్యాక్ టు హోమ్. నేను ఇప్పటినుండి ఇలాంటి మాస్ సినిమాలే తీయాలని డిసైడ్ అయ్యాను. హిట్ సినిమాలే తీస్తాను. 29 నుండి తెలంగాణలో సక్సస్ టూర్ ని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరిని వచ్చి కలుస్తాం. అలానే త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేస్తా” అన్నారు .
ప్రొడ్యూసర్ ఛార్మి మాట్లాడుతూ – ” మా సినిమాను ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికి థాంక్స్. సక్సెస్ టూర్ లో ఎక్కడికి వెళ్లిన విశేష స్పందన లభించింది. ఇదికేవలం 9 రోజుల కలెక్షన్ మాత్రమే… నంబర్స్ ఇంకా పెరుగుతాయి. తక్కువ రోజుల్లోనే ఈ నంబర్స్ సాధించడం హ్యాపీ. ఇప్పుడు పూరి గారు హోమ్ కి వచ్చారు. అతని హోమ్ సక్సెస్. ఈ జోనర్ పూరి హోమ్. ఈ నెల 29 నుండి తెలంగాణ అంతటా పర్యటించనున్నాం. రామ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నిధి, నభ ఇద్దరు చాలా బాగా నటించారు. ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. ” అన్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ -” నాకు చాలా క్రూషియల్ టైం లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరి గారికి అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మి గారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నభ బాగా నటించింది. ఇన్ని రోజులు పూరి సర్ హిట్ కోసం ఎదురుచూడలేదు..హిట్ పూరి సర్ కోసం ఎదురుచూసింది” అన్నారు.
నటుడు సత్య దేవ్ మాట్లాడుతూ – ” ఈ సినిమా రిలీజ్ రోజు నేను కాశ్మీర్ లో షూటింగ్ లో ఉన్నాను. ఫోన్ చేసి అడిగితే హిట్ అన్నారు. నేను నమ్మలేదు నాకు తెలిసిన థియేటర్ ఓనర్ కి ఫోన్ చేశాను. సర్ వన్ ఇయర్ తరువాత ఇప్పుడే హౌస్ ఫుల్ బోర్డు తీసి క్లీన్ చేసి పెట్టాం అన్నారు. ఇంత పెద్ద విజయం లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పూరి గారు ఒక డ్రగ్. దానికి అలవాటు అయితే అంతే. ఇది కేవలం తొమ్మిది రోజుల కలెక్షన్. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలనికోరుకుంటున్నాను’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ భాస్కర బట్ల, కాసర్ల శ్యాం, ఎడిటర్ జునైద్ ,నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను పాల్గొని ఇస్మార్ట్ శంకర్ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.


