రివ్యూ: నేను లేను

0
4482

టైటిల్: నేను లేను

బ్యానర్స్: య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్

న‌టీన‌టులు: హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు

సంగీతం: ఆశ్రిత్‌

కెమెరా:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ)

విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌

స‌హ‌నిర్మాత : య‌షిక

నిర్మాత : సుక్రి

రచన-దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

ఇప్పటి వరకు మంచి కంటెంట్ తో వచ్ఝిన అన్ని థ్రిల్లర్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. దీనికి ‘ఆర్ఎక్స్ 100’ నుండి లేటెస్ట్ హిట్ ‘నిను వీడని నీడను నేనే’ వరకు ఉదాహరణ గా చెప్పొచ్చు, ఇలాంటి క్రమంలోనే ఫస్ట్ లుక్ నుండి ఆడియన్స్ లో కురియాసిటీ పెంచుతూ టీజర్,ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ నేను లేను. ఒక సైకలాజికల్ థిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కోటి మందికి పైగా సినిమా అభిమానులు వీక్షించారు అంటేనే ఈ మూవీ స్టామినా ఏంటో అర్ధం అవుతుంది.
ఈ మధ్య కాలం లో ఒక చిన్న మూవీ కి ఇంత ట్రెమండస్ రెస్పాన్స్ రావడం విశేషం.
ఈ జులై 26 న అత్యంత గ్రాండ్ గా విడుదలవబోతున్న ఈ మూవీ ఎలా ఉందొ ఒక సారి చూద్దాం…

కథ:
కర్నూల్ లో ఈశ్వర్ (హార్షిత్ ) వీడియో ప్రొడక్షన్స్ హౌస్ రన్ చేస్తుంటాడు. తోలి చూపులోనే పార్వతి(శ్రీపద్మ) ని చూడగానే ఇష్టపడతాడు. ఆ ఇష్టం ఇద్దరి మద్య ప్రేమగా మారుతుంది. ఇంట్లో చెపితే ఒప్పుకోరని పారి పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.అలా ఒక సారి ఈశ్వర్ తనను తరుముకొస్తున్న కొందరి నుండి కాపాడుకునే ప్రయత్నంలో కొంత మందిని చంపేస్తాడు. ఆ హాత్యను ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో పోలీసులకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఈశ్వర్ తనని ఎవరో చంపేశారని,తాను పోలీసులతో చెప్తాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు ఈశ్వర్ కోటార్డ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలుసుకుంటారు. దాంతో తాను ప్రేమించిన పార్వతిని గుర్తు పట్టలేనంతగా డిస్ట్రర్బ్ అవుతాడు. మరి ఆ రోజు ఏం జరిగింది. ఈశ్వర్ తనవ్యాధి నుండి బయటపడి తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది కథాంశం.

నటీనటుల పెర్ఫామెన్స్:
హీరో హర్షిత్ కి ఇదితొలి సినిమా అయినా చాలా చక్కగా నటించాడు. ఫస్ట్ ఆఫ్ లో ప్రేమికుడిగా సెంకండ్ హాఫ్ లో కోటార్డ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడున్న వాడిలా మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్ సీన్లలో మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు, మొదటి సినిమాకే డాన్సులు, ఫైట్స్ ఇరగదీశాడనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలలో హర్షిత్ నటన బాగా ప్లస్ అయింది. అలాగే హీరోయిన్ గా నటించిన శ్రీ పద్మకి ఈ సినిమాలో మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది . అలాగే ఆవిడస్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. రొమాంటిక్ గాను కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అలాగే హీరో స్నేహితుడిగా నటించిన వంశీ కృష్ణ పాండ్య కూడా మంచి క్యారెక్టర్ చేసాడు. ఇతర నటీనటులు తమ తమ పరిధి మేర బాగా నటించారు.

టెక్నిషన్స్ పనితీరు:
సైకలాజికల్ థ్రిల్లర్ గా మొదలయిన ఈ కథలోని ట్విస్ట్ లు ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేసేలా దర్శకుడు రామ్ కుమార్ ఈ కథను ఎంతో పకడ్బందీ స్క్రీన్ ప్లే తో అద్భుతంగా మలిచాడు. సీరియస్ గా మొదలైన కథలో వారి ప్రేమకథ అల్లరితో సరదాగా యూత్ ని ఆకట్టుకునే రోమాంటిక్ మాటలు, సన్నివేశాలతో ప్రేమకథను నడిపాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యూత్ కి కనెక్ట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మనిషి తనకు తానే నేను చనిపోయాను అని చెప్పడం వంటి షాకింగ్ సన్నివేశాలను డిజైన్ చేసి కథనం నడిపాడు. ఈ సినిమా థ్రిల్లర్ రా లేక హార్రర్ ఎలిమెంట్స్ ఏమైనా దాగి ఉన్నాయా అనే ఆలోచన లో ప్రేక్షకుడిని పడవేశాడు దర్శకుడు. ఒక థ్రిలర్ ని ఇంట్రెస్టింగ్ గా నడపాలంటే సినిమాటోగ్రఫి బాగా కుదరాలి. దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఎ. శ్రీకాంత్ ల మధ్య మంచి అండర్ స్టాండిగ్ సినిమా బాగా రావడానికి దోహద పడింది. శ్రీకాంత్ తన లైటింగ్ తో మెస్మరైజ్ చేశాడు అనే చెప్పాలి. చాలా సీన్స్ తో తన ప్రతిభ చూపించాడు. లిమిటెడ్ బడ్జెట్ లో గ్రాండియర్ విజువల్స్ అందించాడు. నిర్మాత సుక్రి కుమార్ నిర్మాణాత్మక విలువలు భారీ సినిమా చుస్తున్నామనేలా బాగున్నాయి. అష్రిత్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆర్ ఆర్ ఈ సినిమాకు హార్ట్ లాంటింది. తనకి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి భవిష్యత్ ఉంటుంది

విశ్లేషణ :
రెగ్యులర్ ఫార్మాట్ లో లాగ అనవసర ఎలివేషన్స్ లేకుండా కథలోని సన్నివేశాలతోనే వారిని ఎలివేట్ చేసాడు దర్శకుడు రామ్ కుమార్ . అందుకే కంప్లీట్ సినిమాటిక్ ఫార్మెట్ లో కాకుండా కథ, కథనాలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సగటు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తుంది. నేను చనిపోయాను అని ఒక మనిషి చెప్పడం. అసలు అతను చనిపోయాడనే భ్రమలోకి ఎలా వెళ్ళాడు అనే ట్విస్ట్ ని బాగా డవలెప్ చేసి దానిని ఒక సైంటిఫిక్ రీజన్ తో ముడి పెట్టి ఆడియన్ కి ఎలాంటి కన్ ఫ్యూస్ లేకుండా కన్వీన్స్డ్ గా చెప్పగలిగాడు దర్శకుడు. ఈ సినిమాలో ఒక లిమిటెడ్ పరిస్థితుల్లో , లిమిటెడ్ పాత్రలతో నడిచే కథ అయినా ఆ ఫీల్ ఎక్కడా కలగకపోవడానికి క్యారెక్టర్స్ ని డెవలప్ చేయడంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ద బాగుంది. కొత్తదనం నిండిన కథా, కథనాలను ఇష్టపడేవారికి ‘నేను లేను’ సినిమా లో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అల్లరిగా కనిపించే ప్రేమకథ వెనక ఒక ఎమోషనల్ జర్నీ ని అంతర్లీనంగా చూపించాడు.సస్పెన్స్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ అంశాలని జోడించి ఒక కొత్తరకమైన జోనర్ లో సినిమా తీయడం ఒక ఛాలెంజ్ లాంటిది. దానిని వందకు వంద శాతం అధిగమించారు దర్శకుడు రామ్ కుమార్. క్లైమాక్స్ ఫైట్ ని కమర్షియల్ ఫార్మెట్ లో తీసినా, కథ, కథనాలలో ట్విస్ట్ లు ‘నేను లేను ’ సినిమాకు హైలెట్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఫీల్ ఇస్తుంది.

బాటమ్ లైన్ : నేనులేను మరో మంచి ఫీల్ గుడ్ మూవీ.

రేటింగ్‌: 2.75

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here