డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరుగాంచిన హీరో రామ్ ల కలయికలో ఇటీవాలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్. పూరి మార్క్ టేకింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే సహా హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, మాస్ స్టైల్, డాన్స్ లు మరియు ఫైట్లతో సినిమా అదరగొట్టడంతో ఇస్మార్ట్ శంకర్ సూపర్ సక్సెస్ ని సాధిస్తూ, అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. రామ్ సరసన యంగ్ స్టన్నింగ్ బ్యూటీస్ నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు సహా పలువురు సినిమా ప్రముఖులు అబినందనలు తెలుపుతున్నారు.
ఇక నేడు ఈ సినిమా పై నటుడు మరియు నిర్మాతైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసాను, హీరో రామ్ సహా సినిమాలోని ఆర్టిస్టులందరూ కూడా ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇంత అత్యద్భుతంగా చిత్రీకరించిన దర్శకులు పూరి జగన్నాథ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెల్పుతూ పోస్ట్ చేసారు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం చరణ్ చేసిన ఆ పోస్ట్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….!!


