ఆకట్టుకుంటున్న ‘2 అవర్స్ లవ్’ థియేట్రికల్ ట్రైలర్….!!

0
198

హీరోగా నటిస్తూ, దర్శకుడిగా శ్రీపవార్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం 2 అవర్స్ లవ్. సరికొత్త ప్రేమ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నూతన నటి కృతిగార్గ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య ప్రేమ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని మా సినిమాలో చూపించారు. అలానే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన్మెంట్, హార్ట్ ట‌చింగ్ ఎమోషన్స్ కూడా తమ సినిమాలో ఉంటాయి అంటోంది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయడం జరిగింది.

‘రెండు గంటల ప్రేమకథలు ఎన్ని సినిమాల్లో చూడలేదు, హీరో మరియు హీరోయిన్ ఒకే బస్సులోనో, ట్రైన్ లోనో రెండు గంటలు ఒకరికొకరు మాట్లాడుకుని ప్రేమించుకుంటారు అంటూ నటులు తనికెళ్ళ భరణి పలికే మాటలతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇక ట్రైలర్ లో హీరో, హీరోయిన్లు రోజుకు రెండు గంటలు ప్రేమించుకోవడం, మధ్యలో కొన్ని మనస్పర్థలు రావడం, అలానే అనుకోకుండా ఎదురయ్యే సమస్యలవల్ల చిక్కుల్లో పడడం వంటి అంశాలను బాగా చూపించారు. ‘కథ కొత్తగా ఉంటుంది అనుకున్నా కానీ, మరీ ఇంత కొత్తగానా’ అంటూ తణికెళ్లభరణి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ని ముగించారు.

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అయితే తమ సినిమాలోని ఈ రెండు గంట‌ల ప్రేమ ప్ర‌యాణ‌మేంటో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్‌. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటించగా,

ఈ సినిమాకి సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి, ఎడిట‌ర్‌: శ్యాం వ‌డ‌వ‌ల్లి, మ్యూజిక్‌: గ‌్యాని సింగ్‌, ఆర్ట్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అఖిల గంజి, కో డైరెక్ట‌ర్‌: ఎం.శ్రీనివాస్ రాజు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here