ఈ నెల 29న రివీల్ కానున్న కెజిఎఫ్ చాప్టర్ – 2 అధీరా క్యారెక్టర్ ….!!

0
546

ఇటీవల కన్నడనాట అత్యధిక ఖర్చుతో రూపొంది, దానితోపాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ వంటి ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదలై అతిపెద్ద విజయాన్ని అందుకున్న సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. ఈ సినిమాలో హీరోగా నటించిన కన్నడ నటుడు యష్ అద్భుత నటన, దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ, కథనాలు ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించేలా చేసాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని కీలకమైన అధీరా క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని ఈనెల 29న ఉదయం 10 గంటలకు రివీల్ చేయనున్నారు. చాప్టర్ 1 లో గరుడ బాబాయిగా చెప్పబడే అధీరా క్యారెక్టర్ ను కనిపించీకనిపించకుండా కేవలం కొన్ని క్షణాలు మాత్రమే చూపించడం జరిగింది. అయితే ఈ క్యారెక్టర్ కు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకున్నట్లు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఈ నెల 29వ తేదీ వరకు వేచిచూడాల్సిందే…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here