4 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న కింగ్ నాగార్జున మన్మధుడు – 2 ట్రైలర్…..!!

0
158

కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రూపొందుతున్న కొత్త సినిమా మన్మధుడు-2 . ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. నాగార్జున మరొకసారి విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్,   బ్యానర్లపై ఈ సినిమా ఎంతో భారీ ఖర్చుతో రూపొందుతోంది.

ఈ సినిమాను ఒక ఫ్రెంచ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొండుస్తున్నామని, అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసినట్లు హీరో నాగార్జున ఇటీవల మీడియాతో చెప్పారు. ఇప్పటికే వీక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని రెండు టీజర్లు మరియు ఒక సాంగ్ మంచి సక్సెస్ సాధించగా, మొన్న యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ ట్రైలర్ 4 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. సమంత, అక్షర గౌడ, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగష్టు 9 న విడుదల చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here