ఫస్ట్ వీకెండ్ లో రూ. 54.75 కోట్లు కొల్లగొట్టిన “ది లయన్ కింగ్”….!!

0
2979

హాలీవుడ్ లో 1994లో 2డి యానిమేషన్ మూవీగా రిలీజై మంచి ప్రేక్షకాధరణను సంపాదించిన ‘ది లయన్ కింగ్’ సినిమాను అదే పేరుతో 3డి టెక్నాలజీలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రస్తుతం రూపొందించడం జరిగింది. ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా, మన దేశంలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో విడుదలైంది. ఇక ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రఖ్యాత సినిమా ట్రేడ్ అనాసలిస్టులు చెప్తున్న లెక్కల ప్రకారం ‘ది లయన్ కింగ్’ సినిమా శుక్రవారం రూ. 11.06కోట్లు , శనివారం రూ. 19.15 కోట్లు, అలానే ఆదివారం రూ. 24.53 కోట్లు రాబట్టిందని, దీంతో ఫస్ట్ వీకెండ్ మొత్తం కలిపి రూ. 54.75 కోట్ల మేర కలెక్షన్ సంపాదించినట్లు వారు చెప్తున్నారు.

ఇక భారతీయ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల మార్కును దాటిన మూడవ సినిమాగా ది లయన్ కింగ్ రికార్డులకెక్కింది. ఇంతకు ముందు అవెంజర్స్-ది ఎండ్ గేమ్ (రూ. 158.65 కోట్లు), అవెంజర్స్ ఇన్ఫినిటీవార్ (రూ. 94.30 కోట్లు) ఈ ఘనత సాధించాయి. ఇపుడు ది లయన్ కింగ్ రూ. 54.75 కోట్ల వసూళ్లతో వాటి తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. హీరో సింబా పాత్ర‌కి హిందీలో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు‌లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు. ఇక విల‌న్ స్కార్ పాత్ర‌కి జ‌గ‌ప‌తి బాబు, టైమ‌న్ అనే ముంగిస పాత్ర‌కి ఆలీ, పుంబ అనే అడవి పంది పాత్ర‌కి ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం డ‌బ్బింగ్ చెప్పారు. ఈ విధంగా పలువురు ప్రముఖ నటులతో ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పించడం కూడా సినిమా సక్సెస్ కు ఒక కారణమని, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత అద్భుతమైన కలెక్షన్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here