కర్నూల్, అనంతపురం, ప్రొద్దుటూరు లో ‘ఇస్మార్ట్ శంకర్’ టీమ్ సక్సెస్ టూర్…..!!

0
428

ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన పూరి జగన్నాథ్, లేటెస్ట్ గా ఎనర్జిటిక్ హీరో రామ్ కథయకుడిగా రూపొందించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం దాదాపుగా విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఇది ప్రేక్షక విజయమని,

ఈ విజయాన్ని ముందే ఊహించినప్పటికీ, తాము ఊహించినదానికంటే మరింత అధికంగా తమ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయని ఇస్మార్ట్ శంకర్ యూనిట్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకుని, సినిమా యూనిట్ నేడు కర్నూల్, అనంతపురం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో సక్సెస్ టూర్ చేస్తోంది. కర్నూల్ లోని ఆనంద్ కాంప్లెక్స్ థియేటర్ తో మొదలైన ఈ టూర్, తదుపరి అనంతరపురంలోని త్రివేణి థియేటర్ కు చేరుకొని, అక్కడినుండి రాత్రి ప్రొద్దుటూరు లోని సుధ థియేటర్ కు చేరుకుంటుంది. ఇప్పటికే విజయవంతంగా ప్రారంభమైన ఈ సక్సెస్ టూర్ లో దర్శకుడు పూరి, హీరో రామ్ సహా పలువురు యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here