రజిని, శంకర్ ప్రత్యేక అతిథులుగా గ్రాండ్ గా జరిగిన సూర్య ‘కాప్పన్’ ఆడియో రిలీజ్ వేడుక…..!!

0
110

వెర్సటైల్ స్టార్ సూర్య హీరోగా గతంలో అయన నటించిన వీడోక్కడే, బ్రదర్స్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన కెవి ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త సినిమా కాప్పన్. ఆకట్టుకునే కథనాలు మరియు థ్రిల్లింగ్ అంశాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను తెలుగులో బందోబస్త్ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తమిళ వర్షన్ ఆడియో రిలీజ్ వేడుక నిన్న చెన్నైలో సూపర్ స్టార్ రజిని కాంత్ , ప్రఖ్యాత దర్శకులు శంకర్ లు ప్రత్యేక అతిథులుగా ఎంతో వైభవోపేతంగా జరిగింది.

దర్శకులు కెవి ఆనంద్ తనకు శివాజీ సినిమా సమయం నుండి తెలుసునని, అయన ఒక సినిమా స్క్రిప్ట్ ని జడ్జి చేయడంలో ఎంతో ఎక్స్పర్ట్ అని, నటుడు మోహన్ లాల్ ఒక నాచురల్ యాక్టర్ అని, తప్పకుండా సినిమా హిట్ సాధించి యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు రజిని అన్నారు. హీరో సూర్య రోజురోజుకూ ఎంతో యాంగ్ గా కనపడుతున్నారని, ఇటీవల తాను చూసిన ఈ కాప్పన్ టీజర్ తనకు ఎంతో నచ్చిందని, మాస్ మరియు కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు దర్శకులు శంకర్ మాట్లాడుతూ అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో రజిని ఒకరని, అలానే శంకర్ గారు పాన్ ఇండియా అప్పీల్ గల సినిమాలు తీయడంలో ఎంతో గొప్ప సామర్థ్యం కలవారని, ఇక ఈ సినిమా దర్శకులు ఆనంద్ గారు సినిమాను ఎంతో కష్టపడి చిత్రీకరించారని, రేపు విడుదల తరువాత మంచి సక్సెస్ సాధిస్తామనే నమ్మకం ఉందని సూర్య అన్నారు.

తమ సినిమాలో అందరు నటులు ఎంతో అద్భుతంగా నటించారని, ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇందులో ప్రధాన మంత్రి పాత్రలో నటించిన మోహన్ లాల్ గారి గురించని, అయన తన పాత్రకు జీవం పోశారని ఈ సినిమా దర్శకులు కెవి ఆనంద్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.ఇక ఈ ఆడియో విడుదల వేడుకలో సినిమా యూనిట్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొని సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ అభినందనలు తెలియచేసారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here