సూపర్ స్టార్ మహేష్ గారితో వర్క్ చేయడం ఎంతో అద్భుతమైన అనుభూతినిస్తుంది : డివోపి రత్నవేలు

0
122

సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ తన తదుపరి సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర లు కలిసి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు డీవోపీ గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఛాయాగ్రహకులు రత్నవేలు తన అనుభవాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసారు. సూపర్ స్టార్ మహేష్ గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఇక కాశ్మీర్ లో జరిగిన ఈ షెడ్యూల్ ఎంతో బాగా వచ్చింది. మహేష్ గారు ఆర్మీ ఆఫిసర్ లుక్ లో అదిరిపోయారు, దర్శకులు అనిల్ గారికి, నిర్మాత అనిల్ సుంకరగారికి, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ కు అల్ ది బెస్ట్ చెప్తూ ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ తో కలిసి వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం సినిమాలకు రత్నవేలు గతంలో ఛాయాగ్రాహకులుగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here