ఆకట్టుకుంటున్న నాగార్జున మన్మధుడు-2 ‘హేయ్ మెనినా’ సాంగ్….!!

0
302

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా మన్మధుడు-2. మన్మధుడు-2 పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులందరిలో మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలు పెంచుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని రెండు ట్రైలర్లు వీక్షకులను ఎంతో అలరించాయి. ప్రస్తుతం ఈ సినిమాలో ‘హేయ్ మెనినా’ అనే పల్లవితో సాగె తొలి సాంగ్ ని సినిమా యూనిట్ నిన్న యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.

సినిమాలో హీరో వ్యక్తిగత భావాలకు అద్దంపట్టేలా యూత్ ఫుల్ గా అలానే మంచి ట్రెండీ స్టైల్ లో సాగే బీట్ తో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించబడిన ఈ సాంగ్ కు సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చడంతో పాటు తానే స్వయంగా ఆలపించడం జరిగింది. శుభం విశ్వనాధ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ కు మేఘ్ రాజ్ రవీంద్ర అందించిన ర్యాప్ ప్రధానాకర్షణగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click Here For Hey Menina

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here