ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన సమంత ‘ఓబేబీ’…..!!

0
112

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ఓ బేబీ. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, జగపతి  బాబు, తేజ సజ్జ, నాగ శౌర్య, సునయన తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ మంచి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది.

ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో నిన్నటితో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్ సంపాదించినట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రెండు విభిన్నమైన పాత్రల్లో తన అలరించే నటనతో అందరిని ఆకట్టుకున్న సమంత, ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించారు అనే చెప్పాలి. యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించడం జరిగిందని, ఇక తమ కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకులు అందించిన ఈ విజయంపై దర్శకురాలు నందిని రెడ్డి సహా యూనిట్ సభ్యులు మొత్తం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here