నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. వెరైటీ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ పాయింట్ తో మంచి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు హీరో నాని, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెల్పడం జరిగింది. ఈ సినిమాలో నా పెన్ నేమ్ పెన్సిల్. పెన్సిల్ మరియు అతని గ్యాంగ్ ని ఈనెల 24న కలుసుకోండి, అలానే సినిమా ఎంతో ఫన్నీగా ఆకట్టుకుంటుంది అంటూ అయన పోస్ట్ చేయడం జరిగింది.
యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ రూపొందించిన ఈ సినిమాలోని ‘రారా జగతిని జయించుదాం, రారా చరితని లిఖించుదాం’ అనే పల్లవితో సాగె పాట ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై శ్రోతలను విశేషంగా అలరించింది. ఇక రేపు విడుదల కాబోయే టీజర్ కూడా వీక్షకధారణ పొందుతుందని, అలానే రేపు విడుదల సమయంలో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తమ సినిమా పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతుందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, నటి లక్ష్మి, ప్రియదర్శి, అనీష్ కురువిల్లా, శరణ్య, రఘుబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


