ఈ నెల 24న విశాఖపట్నంలో ‘డియర్ కామ్రేడ్’ ప్రి రిలీజ్ ఈవెంట్….!!

0
432

టాలీవుడ్ లేటెస్ట్ యువ సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందించబడుతున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అధికారిక ట్రైలర్ మరియు లిరికల్ సాంగ్స్ కు వీక్షకుల నుండి మంచి స్పందన రావడం జరిగింది. మొన్న జరిగిన ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్ ను హీరో విజయ్ మరియు హీరోయిన్ రష్మిక ఫ్యాన్స్ పెద్ద సక్సెస్ చేయడం జరిగింది.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం లోని సిరిపురం సర్కిల్ ప్రాంతం వద్ద గల గురజాడ కళాక్షేత్రంలో ఎంతో వేడుకగా జరుపనున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా తరువాత మరొక్కసారి విజయ్, రష్మిక జంట కలిసి నటిస్తున్న సినిమా కావడం, హీరో విజయ్ ఒక పవర్ఫుల్ పాత్రలో అలానే తన కెరీర్ లో తొలిసారి రష్మిక ఒక క్రీడాకారిణి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here