అనుష్క ‘నిశ్శబ్ధం’ టైటిల్ పోస్టర్ విడుదల

0
797

సూపర్ సినిమాతో టాలీవుడ్ కి నటిగా ఎంట్రి ఇచ్చిన అనుష్క, ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆమె నటించిన అరుంధతి సినిమా అనుష్కకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు టాలీవుడ్, కోలీవుడ్ లోని దాదాపుగా అందరూ అగ్ర హీరోలతో నటించి మంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన అనుష్క నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ సినిమా నిశ్శబ్ధం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి క్రాస్ ఓవ‌ర్ చిత్రం ”నిశ్శబ్దం’. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. సస్పెన్స్ సినిమాలు తీయడంలో మంచి పేరుగాంచిన దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుష్క, సినిమా రంగంలోకి ప్రవేశించి 14 ఏళ్ళు గడుస్తున్న శుభసందర్భంలో నేడు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని సినిమా నిర్మాతలు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయడం జరిగింది. రెండు చేతివేళ్ళతో విభిన్నమైన ఆకృతిలో ఉన్న పోస్టర్ డిజైన్ ను రిలీజ్ చేసారు సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. తమిళ నటుడు మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా లోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here