ట్రైలర్‌ చూడగానే బోయపాటి గుర్తుకొచ్చాడు- ‘గుణ 369’ ట్రైలర్‌ లాంచ్ లో అల్లు అరవింద్‌

0
205

కార్తికేయ, అనఘ జంటగా అర్జున జంధ్యాల దర్శకత్వంలో అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘గుణ 369’. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు బోయపాటి శ్రీను సంయుక్తంగా విడుదల చేశారు. ప్రవీణ కడియాల సమర్పిస్తున్న చిత్రమిది. ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో…

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం ‘భద్ర’. 2005లో వచ్చింది. ఆ తర్వాత 2006-7లో నేను ‘తులసి’ని సురేష్‌ ప్రొడక్షన్స్లో చేశాను. అప్పటి నుంచి అర్జున్‌ నా దగ్గరున్నాడు. అంటే దాదాపు 12 ఏళ్లు నాతో ట్రావెల్‌ చేశాడు. అసిస్టెంట్‌ డైరక్టర్‌లో నైపుణ్యం లేకపోతే, అతన్ని పెట్టుకుని మా లైఫ్‌లు తాకట్టుపెట్టలేం. నాతో అన్నేళ్లు ఉన్నాడంటే అర్జున్లో కమిట్‌మెంట్‌ నాకు తెలుసు. అతనికి ఓ పని అప్పగిస్తే, చాలా బాధ్యతగా చేస్తాడు. అలాంటిది తనకే సినిమా వస్తే ఎంత బాధ్యతగా చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్‌ని చూస్తే అతను పెట్టిన ఫ్రేమ్‌లు, లైటింగ్‌, రిచనెస్‌ అన్నీ అర్థమవుతాయి. అతనికి ఫ్రెండ్సే నిర్మాతలయ్యారు. అతను చేసుకున్న కథ విని బావుందని చెప్పగానే ఈ నిర్మాతలు సినిమా చేశారు. ఆస్తిలాగా పక్కన నిలబడ్డారు. కార్తికేయకు ఈ సినిమా చాలా మంచి చిత్రమవుతుంది. ‘ఆర్‌.ఎక్స్‌.100’లో కొత్తదనం ఉంది. ఈ సినిమాలోనూ కొత్తదనం ఉంది. అనఘది ఫొటోజెనిక్‌ ఫేస్‌. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. రామకృష్ణ నా దగ్గర ఫైట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు’’ అని అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చూడగానే బోయపాటి గుర్తుకొచ్చాడు. బోయపాటి ఆర్గనైజ్డ్‌ డైరక్టర్‌ ఈ చిత్ర నిర్మాతలకు ఇండస్ట్రీ కొత్త కాదు. నాకు తిరుమల్‌ మంచి స్నేహితుడు. నేను, తిరుమల్‌, శ్రీను అని ఇంకో వ్యక్తి తరచూ కలుస్తుంటాం. తిరుమల్‌ని సినిమా నిర్మించమని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నా. ఇప్పటికి చేశాడు. మా బ్యానర్‌లో సూపర్‌హిట్‌ సినిమా ఇచ్చిన బోయపాటితో మరో సినిమా చేయబోతున్నాను. కార్తికేయకు గీతా ఆర్ట్స్‌కు వెల్‌కమ్‌ చెబుతున్నా. తనవంతు 100 శాతం డెలివర్‌ చేయగలిగిన హీరో అతను. అనఘ చూడ్డానికి బావుంది. సంగీతం బావుంది. చైతన్ చేసిన పాటలు విన్నాను’’ అని చెప్పారు.

ఆదిత్యమీనన్ మాట్లాడుతూ ‘‘చాలా ఏళ్ల తర్వాత మంచి కథ చేశాను. మంచి కథ ఇది. నాకు బాగా నచ్చింది. పవర్‌ఫుల్‌ సినిమా అవుతుంది’’ అని అన్నారు.

హేమ మాట్లాడుతూ ‘‘నాకు ప్రవీణ, అనీల్‌ చాలా మంచి పరిచయం. ముందు నాకు ఇందులో కేరక్టర్‌ అనుకోలేదు. కానీ ఆ కేరక్టర్‌ మీద నా పేరు రాసి పెట్టి ఉంది. అందుకే నాకే వచ్చింది. దర్శకుడికి మంచి టేస్ట్‌ ఉంది. సినిమా చాలా బాగా చేశాడు. ఇందులో హీరో మదర్‌గా చేశాను. మా హీరో చాలా స్మార్ట్‌గా కనిపిస్తాడు. పక్కింటబ్బాయి ఇమేజ్‌ అతనికి ఈ సినిమాతో వచ్చేస్తుంది’’ అని చెప్పారు.

కౌముది మాట్లాడుతూ ‘‘ప్రవీణ చాలా బాగా సపోర్ట్‌ చేశారు. ఇందులో హీరో చెల్లెలిగా నటించాను. అర్జున్ గారి దర్శకత్వం చూస్తే ఎవరూ తొలి చిత్ర దర్శకుడు అనుకోరు. కార్తికేయ, అనఘతో పనిచేయడం హ్యాపీ’’ అని అన్నారు.

రామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఆర్‌.ఎక్స్‌.100కన్నా మంచి హిట్‌ సినిమా అవుతుంది’’ అని తెలిపారు.
చైతన్ భరద్వాజ్‌ మాట్లాడుతూ ‘‘నా రెండో సినిమా ఇది. పిల్లారా పాటకు మంచి పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చాయి. అదే వైబ్స్‌తో గుణ పాటలు చేశాను. రెండో సినిమానే అయినా, నిర్మాతలు నన్ను నమ్మి చేయించుకున్నారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అందరూ చాలా బాగా చేశారు’’ అని చెప్పారు.

అనఘ మాట్లాడుతూ ‘‘నా పాత్ర పేరు గీత. కార్తికేయ సాలిడ్‌గా సపోర్ట్‌ చేశారు. హేమగారు, కౌముది కూడా సపోర్ట్‌ చేశారు. ఆథెంటిక్‌ స్ర్కిప్ట్‌ ఇది. అర్జున మేకింగ్‌ బావుంది’’ అని అన్నారు.

తిరుమలరెడ్డి మాట్లాడుతూ ‘‘మన అనుకునేవాళ్లు అందరూ బావుండాలని అనుకునేవారు అల్లు అరవింద్‌గారు. మాకు ఈ సినిమా కథ నుంచి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. మా దర్శకుడు అర్జున చెప్పిన కథను చెప్పినట్టుగా స్ర్కీన మీద పెట్టారు. ఆర్‌.ఎక్స్‌.100లో కార్తికేయ కమిట్‌మెంట్‌, డెడికేషన గ్రేట్‌. అనఘకు తెలుగు తెలియకపోయినా, చాలా బాగా చేసింది. మా టీమ్‌తో జెల్‌ అయింది’’ అని అన్నారు.

అనిల్‌ కడియాల మాట్లాడుతూ ‘‘టీవీ షోలు, ఈవెంట్స్‌ చాలా చేశాం. తిరుమల్‌రెడ్డిగారు, మేమూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. చిన్న సినిమాగా మొదలుపెట్టాం. కానీ పెద్ద స్థాయిలో తెరకెక్కింది. మా దర్శకుడు మాకు చెప్పింది చెప్పినట్టు తీశారు. సెకండ్‌ హాఫ్‌లో అద్భుతమైన ఫీల్‌తో బయటికి వస్తారు. హానెస్ట్‌ అటెంప్ట్‌ చేశాం’’ అని అన్నారు.

అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారు, బోయపాటిగారు మా ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేను బోయపాటిగారి ఇంట్లో వాళ్లకన్నా ఎక్కువగా మెలిగాను. ప్రవీణగారు కథ విని నాకు సాయం చేశారు. అనిల్‌గారు, తిరుమలరెడ్డిగారు నమ్మారు. అనఘకి, నరేష్‌కి, హేమగారికి, కౌముదికి, ఆదిత్యమీననకు ధన్యవాదాలు. ఆర్టిస్టులందరూ నాకు బాగా సాయం చేశారు. టెక్నీషియన్లు అందరూ బాగా కష్టపడ్డారు. బోయపాటిగారు లేకుండా ఈ సినిమా మేం చేయలేం. రియల్‌ ఇన్సిడెంట్లు బేస్‌ చేసుకుని చేశాం. తెరమీద మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఉంటుంది. ఎమోషన బావుంటుంది. కొత్త సినిమాలు రావట్లేదనీ, మంచి సినిమాలన్నీ తమిళ, మలయాళ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయనీ అనేవారికి ఈ సినిమా ఒక సమాధానంగా ఉంటుంది’’ అని అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారు, బోయపాటిశ్రీనుగారు ట్రైలర్‌ లాంచ్కి రావడం వల్ల మా సినిమాకు ఒక రేంజ్‌ వచ్చింది. వారిద్దరు కలిసి చేసిన ‘సరైనోడు’ కన్నా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ చిత్రానికి పెద్ద హిట్టు, సూపర్‌హిట్టులాంటి పదాలు వాడను. ఎందుకంటే ఇది నా మనసుకు నచ్చిన సినిమా. విన్న 30 నిమిషాల్లోనే కథ ఓకే చెప్పేశాను. రెండున్నర గంటల సేపు నెరేషన కూడా వినలేదు. ఇంపల్సివ్‌గా తీసుకున్న నిర్ణయం ఇదే. రిఫ్లెక్షన యాక్షన అంటారు కదా.. ఈ సినిమాను అలా అంగీకరించాను. ఇందులో యాక్షన సీక్వెన్స కూడా కావాలని పెట్టలేదు. ఆ సిట్చువేషనలో ఎవరున్నా అలాగే బిహేవ్‌ చేస్తారు కాబట్టి పెట్టారు. ఆర్‌.ఎక్స్‌.100 కల్ట్‌ సినిమా. దాన్నుంచి బ్రేక్‌ ఇచ్చే సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ సినిమా అలాంటి సినిమా. ఇప్పటికీ చాలా మందికి నా పేరు తెలియదు. ఆర్‌.ఎక్స్‌.100 హీరో అని అంటుంటారు. ఈ సినిమా విడుదల తర్వాత నన్ను అందరూ గుణ అని పిలుస్తారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు నా యాక్టింగే నాకు నచ్చింది. దర్శకుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. చాలా బాగా చేయించారు. ఇందులో గుణ, గీతా జర్నీని ఎవరూమిస్‌ కావద్దు. కచ్చితంగా మా సినిమా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స ఇస్తుంది. ఆగస్ట్‌ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.

నటీనటులు
కార్తికేయ, అనఘ, ఆదిత్య మీనన, మంజు భార్గవి, నరేష్‌, హేమ, కౌముది, మహేష్‌, సాక్షి శివ, చిట్టి, దిల్‌ రమేష్‌ కీలక పాత్రధారులు.

సాంకేతిక నిపుణులు
సంస్థలు: స్ర్పింట్‌ టెలిఫిల్మ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైనమెంట్స్‌, ఎస్‌జీ మేకర్స్‌,
సమర్పణ: ప్రవీణ కడియాల
నిర్మాతలు: అనిల్‌ కడియాల, తిరుమల రెడ్డి,
రచన, దర్శకత్వం: అర్జున జంధ్యాల
సంగీతం: చైతన భరద్వాజ్‌
కెమెరా: రామ్‌
ఎడిటర్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: జీఎం శేఖర్‌
ఫైట్‌ మాస్టర్‌: రామ కృష్ణ
పాటలు: రామజోగయ్యశాసి్త్ర, అనంత శ్రీరామ్‌, కల్యాణ్‌ చక్రవర్తి, విశ్వనాథ్‌
నృత్యాలు: రఘు, భాను, శ్రీవీర్‌
ఎగ్జిక్టూటివ్‌ నిర్మాతలు: శివ మల్లాల, సత్యకిషోర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here