అభిమానులకు చేరువవడం ఆనందంగా ఉంది : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

0
129

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టి స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్, ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించడం జరిగింది.

ఈ విషయమై కాసేపటి క్రితం ఒక వీడియో బైట్ రూపొందించి విడుదల చేసిన చరణ్ మాట్లాడుతూ, ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేయడం కొత్తగా ఉందని, అయితే దీని ద్వారా తమ అభిమానులకు మరింత చేరువయ్యానని, తనకు వారిపై ప్రేమ అభిమానాలు ఎప్పుడూ నిలిచి ఉంటాయని, తనను ఫాలో అవుతున్నవారందరికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ప్రస్తుతం చరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియో బైట్, సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here