ఈ నెల 9న ‘మన్మధుడు – 2’ లో అవంతికగా రకుల్ ప్రీత్ లుక్ రిలీజ్….!!

0
61

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మరియు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ హీరోయిన్ గా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న మన్మధుడు-2లో ఆయన సరసన జతకడుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే టీజర్ లో హీరోయిన్ పాత్రను మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు తమ చిత్రంలో అవంతికగా నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన రొమాంటిక్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రొమాంటిక్ స్టయిల్లో మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్,  అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండగా సీనియర్ నటి లక్ష్మి, నాజర్, వెన్నెల కిశోర్, రావు రమేష్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here