అమలాపాల్ “ఆమె” ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

0
117

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి, మంచి నటిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించిన అమల పాల్ , ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఆమె. తమిళంలో ఆడై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్, ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక నేడు ఈ చిత్ర ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. బెట్‌ కడతావా?‘బెట్‌ కడతారా?.‘బెట్‌ కడతావా? అంటూ అమలాపాల్‌ అందర్ని సవాల్‌ చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమమవుతుంది.

ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్ సన్నివేశాలతో సాగుతుంది. ఇక ఈ ట్రైలర్‌ లో అమలాపాల్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం జరిగింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయ్ అనే చెప్పాలి. ప్రముఖ ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకుని, తన చ‌రిత్ర చిత్ర ప్రొడ‌క్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రదీప్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్ కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here