‘ఓ బేబీ’ చిత్రాన్ని అభినందించిన అక్కినేని నాగార్జున….!!

0
120

కింగ్ అక్కినేని నాగార్జున అద్భుతమైన నటులు మాత్రమే కాదు మంచి మనసున వ్యక్తిగా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఇక ఎప్పటికపుడు విడుదలయ్యే మంచి సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి, వారిని ఎంకరేజ్ చేసే నాగార్జున, నేడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇటీవల అక్కినేని సమంత ప్రధానపాత్రలో నటించి మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ చిత్రంపై అభినందనలు కురిపించారు. ఓ బేబీ చిత్రాన్ని చూసాను, ఎంతో నచ్చింది, సీనియర్ నటి లక్ష్మి గారు, మరియు ఇతర నటులైన రావు రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యంగా సమంత సహా ఈ చిత్రంలోని ప్రతిఒక్కరు ఎంతో చక్కగా నటించారని,

ఇక దర్శకురాలు నందిని రెడ్డి చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల మదిని దోచారని  నాగార్జున ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే నాగార్జున గారి పోస్ట్ కు స్పందించిన సమంత, మీరు మా చిత్రాన్ని మెచ్చుకోవడంతో ఎంతో ఆనందంతో డాన్స్ చేయాలనిపిస్తుంది. మాలాంటి వారి సక్సెస్ ని గుర్తించి అభినందించే మీరు ఎంతో గొప్ప వ్యక్తి అంటూ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here