రెబల్ స్టార్ ‘సాహో’ నుండి “సైకో సయ్యా” సాంగ్ టీజర్ విడుదల…!

0
106

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థపై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కొత్త సినిమా సాహో. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తొలిసారి హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల వీక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందన రాబట్టింది. హాలీవుడ్ రేంజి విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ అదరగొట్టడంతో, చిత్ర బృందం అదే ఊపుతో నేడు సాహో లోని ‘సైకో సయ్యా’ అనే పల్లవితో సాగె పాట టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.

మంచి ట్రెండీ స్టయిల్లో వెస్ట్రన్ బీట్ తో సాగె ఈ సాంగ్ టీజర్ లో ప్రభాస్, శ్రద్ధ అల్ట్రా స్టైలిష్ లుక్ కాస్ట్యూమ్స్ లో అదరగొట్టారు. ఇక టీజర్ లో ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవడం ఖాయం అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాని ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here