‘ఓ బేబీ’ కామెడీ, సెంటిమెంట్‌ అన్నీ కలగలిసి మనసుకు హత్తుకునే చిత్రం – సమంత అక్కినేని

0
126

సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్‌, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన తారాగణంగా సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్‌ పిక్చర్స్‌ పతాకాలపై బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.మిక్కి జె.మేయర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫన్‌ రైడర్‌గా ఈ సినిమా రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా సమంత అక్కినేని ఇంటర్వ్యూ..

ఈ సినిమా మొత్తం మీరే భుజాల మీద మోస్తున్నట్టున్నారు?
– నా కెరీర్‌లో స్పెషల్‌ చిత్రమిది. చాలా మంది చూడాలన్న తాపత్రయం ఉంది. అందుకే నేను ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నా. ఇప్పటి వరకు కెరీర్ పరంగా నేను నటించిన చిత్రాల్లోని పాత్రలన్నిటికంటే ప్రస్తుతం నటిస్తున్న ఓబేబీ చిత్రం లోని పాత్ర ఎంతో ప్రత్యేకం . సినిమా కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించినప్పటికీ, నాకు పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేయాలని ఉండేది, అయితే ఆ కోరిక ఈ చిత్రం ద్వారా తీరింది.

మజిలీ కూడా మీరే దగ్గరుండి చూసుకున్నట్టున్నారు?
– అంటే ఆ సినిమా పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేశాం. మరింత బాధ్యతగా అనిపించింది.

ఈ మధ్య తిరుపతికి తరచూ వెళ్తున్నట్టున్నారు?
– మామూలుగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రం నేను తిరుపతికి వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు నా కెరీర్‌లో తొలిసారి నా సినిమాకు తిరుపతికి వెళ్లాను. మామూలుగా సినిమా చాలా బాగా వచ్చింది. మహేష్‌, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ వంటివారయితే థియేటర్స్‌ కు ఆటోమేటిగ్గా క్రౌడ్‌ వచ్చేస్తారు. ఎంత అమ్మాయి స్టార్‌ హీరోయిన్‌ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం మామూలు విషయం కాదు. అందుకే నా వంతు నేను విపరీతంగా పబ్లిసీటీ చేస్తున్నా. ఒక్కసారి థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఎందుకంటే టీజర్ , ట్రైలర్‌ ఇప్పటికే అందరికీ నచ్చింది. మంచి సినిమా తీశానని నాకూ తెలుసు.

ఈ తరహా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి కదా?
– నిజమే. మామూలుగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు అనగానే థ్రిల్లర్‌ చిత్రాలనో, మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలో ఉంటాయి. కానీ ఇందులో మెసేజ్‌ ఉంటుంది. అయితే అది పూర్తిగా కామెడీగా సాగుతుంది. మనసుకూ హత్తుకుంటుంది. అందుకే ఈ సినిమా స్పెషల్‌. కామెడీ, కమర్షియల్‌, సెంటిమెంట్‌ అన్నీ కలగలిసి ఉన్నాయి.

https://industryhit.com/t/samantha-akkineni-pics-2/

రీమేక్‌ చేయడం ఎలా అనిపించింది?
– మామూలుగా రీమేక్‌లు చేయడం వేరు. ఈ సినిమాను రీమేక్‌ చేయడం వేరు. ఈ చిత్రానికి అఫిషియల్‌గా ఇది ఏడో రీమేక్‌. అందుకే చాలా జాగ్రత్తగా చేశాం. ఏదో రైట్స్‌ తీసుకుని, మనకు తగ్గట్టు మార్చి చేసుకున్నాం అనే భావనతో కాకుండా, ఒరిజినల్‌ వాళ్లను పెట్టుకుని ప్రతి సన్నివేశం ఎందుకు పెట్టారో తెలుసుకుని ప్రాపర్‌గా రీమేక్‌ చేశాం. తెలుగు సినిమాకు కూడా ఒరిజినల్‌ వాళ్లు నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నారు.

కామెడీ లో నటించేటప్పుడు ఎలా అనిపించింది?
– నాకు ఎమోషనల్‌ సీన్స్‌, రొమాన్స్‌, డ్రామాలకు ఉన్న రిథమ్‌ బాగా తెలుసు. అయితే కామెడీ రిథమ్‌ తెలియదు. కామెడీ చూడటం తేలికే. నవ్వడం తేలికే. కానీ సాయంత్రం అయ్యే సరికి కామెడీ చేసిన వాళ్లు డ్రెయిన్‌ అయిపోతారు. ఆ విషయం నాకు ఈ సినిమాతో చాలా బాగా తెలిసింది. రాజేంద్రప్రసాద్‌గారు నాకు చాలా బాగా నేర్పించారు. కామెడీ సీన్‌ చేసేటప్పుడు పంచ్‌తో ల్యాండ్‌ అయ్యే విషయాలన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయనతో చేసిన సన్నివేశాలన్నీ మరో లెవల్లో ఉంటాయనడం అతిశయోక్తి కాదు.

60 ఏళ్ల బామ్మగా నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?.
– నాకు నాన్నమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు లేవు. అందుకే కొన్ని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లకు వెళ్లాను. వాళ్లతో సమయం గడిపాను. వయసు పెరిగే కొద్దీ వారు చిన్నపిల్లలై పోవడాన్ని గమనించాను. అది నాకు చాలా హెల్ప్‌ అయింది.

లక్ష్మిగారితో మీ అనుబంధం?
– మా ఇద్దరికీ సినిమాలో సీన్స్‌ లేవు. అయితే ఒకే ఒక రోజు మాత్రం ఆమె అడుగులో అడుగు వేసినంత జాగ్రత్తగా ఆమెను అనుసరించాను. ఆమె హావభావాలను ఆకళింపు చేసుకున్నా.

లేడీ డైరక్టర్‌ డైరక్షన్‌లో చేయడం ఎలా అనిపించింది?
– నందినిరెడ్డి నాకు చాన్నాళ్లుగా బాగా తెలుసు. ఓబేబీ తరహా వ్యక్తి ఆమె. చాలా బోళా మనిషి. ఈ ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నప్పటికీ ఆమె ఎంతో ప్యూర్‌ హార్ట్‌ తో ఉంటుంది. ఇక లేడీ డైరక్షన్‌ అంటారా? భవిష్యత్తులోనైనా కనీసం ఇలాంటి జండర్‌ తేడాలు రావనే అనుకుంటున్నా. చాలా జెన్యూన్‌గా చేసింది. కేపబులిటీ ఉన్నవారికే ఇక్కడ అవకాశాలు వస్తాయి. వాటిని వాళ్లు నిలబెట్టుకుంటారు. ఈ ప్రాజెక్ట్‌ కు 7-8 మంది అమ్మాయిలు పనిచేశారు. ఎక్కడా ఒక్క రోజు కూడా షూట్‌ మిస్‌ కాలేదు. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని చేశాం. చాలా బాగా చేశాం.

మీరు బేబీ మేనియాలోనుంచి బయటపడ్డారా?
– బయటపడటానికే ప్రయత్నిస్తున్నా. ఈ మధ్య నా తోటి హీరోయిన్లతో కలిసి ఓ వేడుకకు వెళ్లా. అక్కడ ఫొటోలకు ఇచ్చిన ఫోజులు చూస్తే ఓ బేబీ ప్రభావం నా మీద ఎంత ఉందో ఇట్టే అర్థమైపోయింది. సింగర్‌ చిన్మయి నా ఫొటోలు చూసి ఆ మేనియా నుంచి త్వరగా బయటపడాలని సూచించింది. ఈ సినిమలో నా పాత్రకు చిన్మయి గోదావరి స్లాంగ్‌లో డబ్బింగ్‌ చెప్పింది.

దేవి థియేటర్‌ ముందు మీకు పెద్ద కటౌట్‌ పెట్టారట.
– కటౌట్లది ఏముంది? కలెక్షన్లు రావాలి. యు టర్న్‌ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఈ సినిమాకు మాత్రం కలెక్షన్లు రావాలి.

మీకు ఎవరి దర్శకత్వంలోనైనా నటించాలనే కోరిక ఉందా?
– శేఖర్‌ కమ్ములగారు హీరోయిన్లను ప్రొజక్ట్‌ చేసే తీరు చాలా బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది.

రీమేక్‌లంటే ఇష్టమా?
– నిజానికి నాకు రీమేక్‌ల దశ నడుస్తోంది. అంతేగానీ రీమేక్‌ చేయాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం 96 సెట్స్‌ మీద ఉంది. మన్మథుడు2లో చిన్న పాత్ర లో చేశా. మిగిలిన సినిమాలు త్వరలోనే అనౌన్స్‌ చేస్తా.

ఓ బేబీలో కష్టపడి చేసిన సన్నివేశం ఏది?
– క్లైమాక్స్‌ సీన్‌ చాలా కష్టపడి చేశా. మామూలుగా ఎమోషనల్‌ సీన్‌ అంటే ఈజీగా చేస్తాననే ధీమా ఉండేది. కానీ ఎందుకో ఆ రోజు ఏడుపు రాలేదు. నా కెరీర్‌ మొత్తం మీద నేను రెండు గంటలు బ్రేక్‌ తీసుకుని ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా అది.

భవిష్యత్తులో దర్శకత్వం, నిర్మాణం..
– దర్శకత్వం ఆలోచనలు లేవుగానీ, సినిమాలు నిర్మించాం. మహిళాప్రాధాన్యం గల కంటెంట్‌తో సినిమాలు చేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సమంత అక్కినేని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here