చియాన్ విక్రమ్ “మిస్టర్ కేకే” చిత్ర ట్రైలర్ విడుదల నేడే…!!

0
178

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న నటుడు చియాన్ విక్రమ్. ఇక ప్రస్తుతం అయన నటిస్తున్న కొత్త చిత్రం ‘మిస్టర్ కేకే’. తమిళంలో ‘కదరం కొండన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మిస్టర్ కేకే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానరైన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత ఆర్ రవీంద్రన్ సంయుక్తంగా ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటిస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం విడుదలైన ఈ చిత్ర తమిళ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

మంచి ఆకట్టుకునే థ్రిల్లింగ్ కథాంశంతో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఒక విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం మరియు నేపధ్య సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ని ఆర్ గుతా, ఎడిటింగ్ కే ఎల్ ప్రవీణ్, ఆర్ట్ ప్రేమ్ నవాస్ అందిస్తున్నారు. ఇకపోతే రాజేష్ ఎన్ సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని నేడు సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. అలానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని రాబోయే దీపావళి పండుగా కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here