“దొరసాని” చిత్రం నుండి మూడవ పాట నేడు విడుదల…!!

0
530

తెలుగు తెరకు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం దొరసాని. కొన్నేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలోని దొరల పాలన సమయంలో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథను స్ఫూర్తి గా తీసుకుని ప్రస్తుతం తెరకెక్కుతోందీ చిత్రం.  ఈ చిత్రాన్ని సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. మరోవైపు ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు శ్రోతల నుండి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం నేడు ఈ చిత్రంలోని ‘కప్పతల్లి కప్పతల్లి’ అనే పల్లవితో సాగె మూడవ పాటను యూట్యూబ్ లో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, ఎడిటర్ : నవీన్ నూలి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి అందిస్తుండగా అన్ని కార్యమ్రమలు పూర్తి చేసి చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here