“ఇస్మార్ట్ శంకర్” ట్రైలర్ నేడు విడుదల….!!

0
475

టాలీవుడ్ లో తన ఆకట్టుకునే నటనతో ఎనర్జిటిక్ స్టార్ గా పేరుగాంచిన నటుడు రామ్. ప్రస్తుతం అయన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. మంచి మాస్ మసాలా అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టాయి. ఈ చిత్ర ట్రైలర్ ను నేడు యూట్యూబ్ ల విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.

చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా సత్య దేవ్, పునీత్ ఇస్సార్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here