సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న చిత్రం మహర్షి. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్, సాహిత్యాన్ని శ్రీమణి, ఫోటోగ్రఫిని కెయు మోహనన్ అందించడం జరిగింది.
ఇటీవల 213 కేంద్రాల్లో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని వీడియో సాంగ్స్ నిన్న యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. నిన్న అర్ధరాత్రి నుండి ఈ చిత్రం ప్రముఖ వెబ్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. ఇక ఈ విషయమై నేడు చిత్ర బృందం నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. సూపర్ స్టార్ మహేష్ మూడు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించిన ఈ చిత్రంలో, ఆయనకు స్నేహితుడిగా అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు…..!!