యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం సాహో. బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో సాహో పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఇటీవల వీక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర టీజర్ తో ఆ అంచనాలు అమాంతం పెరిగాయి అనే చెప్పాలి. కళ్ళు మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ మరియు యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టే విజువల్ ఎఫెక్ట్స్ తో సాహో టీజర్ అదరహో అనే స్థాయిలో రూపొందింది.
ఇకపోతే ఈ చిత్రం నుండి మొదటి పాట గా ‘సైకో సైయాన్’ అనే పల్లవితో సాగే పాటను అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రన్ రాజా రన్ తో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో వంశీ, ప్రమోద్ నిర్మస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు……!!


