యువ సంచలన నటుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం రణరంగం. విభిన్న తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర టీజర్, ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో అదరగొట్టే విజువల్స్ తో రూపొందించబడి విపరీతమైన ప్రేక్షకాదరణతో ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
1990ల నాటి గ్యాంగ్ స్టర్ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ తన కెరీర్ లో ఇప్పటివరకు నటించని ఒక సరికొత్త తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. శర్వానంద్ సరసన ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రశాంత్ పిళ్ళై అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ గా రవీందర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం….!!


