విజయ నిర్మల గారి మృతిపట్ల సూపర్ స్టార్ కృష్ణ గారిని, నరేష్ ని కలిసి సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు, బాలకృష్ణ…!!

0
472

దివంగత దిగ్గజ నటి మరియు మహిళా దర్శకురాలిగా 44 చిత్రాలు తెరకెక్కించి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్న శ్రీమతి విజయ నిర్మల గారు ఇటీవల అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతితో సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఇప్పటికే పలువురు సినీప్రముఖులు కృష్ణ గారిని, నరేష్ గారిని పరామర్శించి వెళ్తున్నారు. నేడు నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడుగారి కుటుంబసభ్యులు కృష్ణ గారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది.

అయితే వారు అక్కడకు వెళ్లిన సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారితోపాటు అక్కడకు రావడం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమకు విశేష సేవలందించిన విజయ నిర్మల గారి మరణం నిజంగా తెలుగు జాతికి తీరని లోటని, ఆమె మృతి తరువాత పూర్తిగా దిగులుపడ్డ కృష్ణ గారు వీలైనంత త్వరగా ఆ విషాద ఘటనను మరిచి, రాబోయే రోజుల్లో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తూ మాట్లాడినట్లు సమాచారం. ఇక నరేష్ గారితో మాట్లాడుతూ గతంలో విజయ నిర్మల గారితో వారికి అనుబంధాన్ని చంద్రబాబు, బాలకృష్ణ గుర్తుచేసుకున్నారట….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here