దివంగత నటులు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారి తనయుడు మేఘంశ్ శ్రీహరి తొలిసారి తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “రాజ్ దూత్”, లిమిటెడ్ ఎడిషన్’ అనేది ఉప శీర్షిక. వాస్తవానికి తండ్రి శ్రీహరి గారి మరణం, అలానే ఆ తరువాత పైచదువుల కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శక ద్వయం అర్జున్ – కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా మేఘంశ్ సరసన నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ మిలియన్ వ్యూస్ అధిగమించి యూట్యూబ్‌లో అనూహ్యమైన ఆదరణ పొందడంతో, నేడు ఈ చిత్ర అధికారిక ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ఒక వినోదాత్మకంగా ప్రేమ, సెంటిమెంట్, ఎమోషన్ల కలయికలో రూపొందిన చిత్రం అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో మేఘంశ్, తండ్రి శ్రీహరి గారిలానే తన ఆకట్టుకునే స్టైల్, నటన మరియు డైలాగులతో అదరగొట్టాడు. ఈ ట్రైలర్ తో చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో సుదర్శన్, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్, అనిష్ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్, దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు, బిహెచ్‌ఇఎల్. ప్రసాద్, భద్రం, జెమినీ అశోక్, మృణాల్, బిందు, రాజేశ్వరి, శిరీష, నళిని, మాస్టర్ ఈశాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి సంగీతం: వరుణ్ సునీల్, రచనా సహకారం: వెంకట్, డి. పాటి, పాటలు: కిట్టు విస్పాప్రగడ, రాంబాబు గోపాల, పి.ఆర్.ఓ:. సురేష్ కొండేటి, పబ్లిసిటీ: అనంత్, ఆర్ట్: మురళీ వీరవల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్, నిర్మాత: ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు). రచన, దర్శకత్వం: అర్జున్-కార్తీక్…!!


