ప్రారంభం కానున్న శ్రీమతి విజయనిర్మల గారి అంతిమ యాత్ర …!!

0
338

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఇలా పలువిధాలుగా విశేష సేవలందించిన గిన్నిస్ రికార్డు గ్రహీత శ్రీమతి విజయనిర్మల గారు నిన్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి జీవిత భాగస్వామిగా ఎన్నో ఏళ్లపాటు ఆయనకు తోడు నీడగా నిలిచిన విజయనిర్మల గారు, ఇకపై తనతో ఉండరనే విషయాన్ని కృష్ణ గారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న నానక్ రామ్ గూడలోని తమ స్వగృహంలో ఉంచిన ఆమె పార్థివదేహాన్ని చూడడానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు రావడం జరిగింది.

విజయనిర్మల గారు లేని లోటు తీర్చలేనిదని, ఎంతో బాధతో కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ గారిని చూస్తుంటే తమ గుండె తరుక్కుపోతుందని అందరూ బాధను వ్యక్తం చేస్తున్నారు . కృష్ణ గారికి, మానసిక ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పలువురు కోరుకున్నారు. ఇక నేడు విజయనిర్మల గారి అంతిమయాత్ర నానక్ రామ్ గూడ లోని వారి ఇంటి నుండి ప్రారంభమై చిలుకూరులో వారి ఫామ్ హౌస్ వరకు సాగుతుంది. ఇక అక్కడే కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here