“బ్రోచేవారెవరురా” పై నాచురల్ స్టార్ నాని ప్రశంసలు…!!

0
98

విలక్షణ చిత్రాల నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా, నివేత థామస్, నివేత పేతురాజ్ కథానాయికలుగా రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం బ్రోచేవారెవరురా. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలు, చిత్రంపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.  నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై నాచురల్ స్టార్ నాని, తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పొగడ్తల జల్లు కురిపించారు. ఇప్పుడే బ్రోచేవారెవరురా చిత్రం చూడడం జరిగింది, చిత్రం ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉంది.

నటులు విష్ణు, సత్యదేవ్, నివేత థామస్, నివేత పేతురాజ్ అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇక చిత్ర దర్శకుడు వివేక్, చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. అలానే సినిమాలో సంగీతం కూడా ఎంతో బాగుంది, నేడు విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అంటూ అయన ట్వీట్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here