సూర్య హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘బందోబస్త్’

0
499

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు… ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ’24’ వంటి డిఫరెంట్ సినిమాలు… ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నేడు, తమిళ నటుడు సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ‘బందోబస్త్’ చిత్ర తెలుగు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ‘రంగం’తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్న కె.వి. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వీడోక్కడే’, ‘బ్రదర్స్’ తరవాత సూర్య, కె.వి. ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ‘నవాబ్’, ‘2.0’ వంటి హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రాజమౌళి, చిత్ర బృందానికి అలానే ఈ చిత్రంలో నటిస్తున్న నటులు సూర్య, ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్య ఇంటెలిజెంట్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, సాయేషా, ఆర్య, బోమన్ ఇరానీ, సముద్ర ఖని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: వనమాలి, చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హారీస్ జయరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here