“ఓ బేబీ” ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఖరారు….!!

0
32

ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని సమంత హీరోయిన్ గా, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఓ బేబీ’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రేపు హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో చిత్ర యూనిట్ సభ్యులు మరియు అతిథుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మి, నటులు రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, తేజ సజ్జ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here