సూర్య సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్న దర్శకుడు రాజమౌళి….!!

0
75

తమిళం తోపాటు తెలుగులో కూడా హీరోగా తనకంటూ ఒక స్టైల్ ని మరియు ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నటుడు సూర్య. ఇక ప్రస్తుతం అయన కెవి ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఇది వరకు సూర్య మరియు కెవి ఆనంద్ కలయికలో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకొడవంతో ఈ చిత్రంపై బాగా అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం వీరిద్దరి కలయికలో రానున్న ఈ కాప్పాన్ చిత్ర తెలుగు టైటిల్ ను దర్శకదీరుడు రాజమౌళి 27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రకటన చేయనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కెవి ఆనంద్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెల్పడం జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్య, సాయేషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here