‘బుర్రకథ’ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన నాచురల్ స్టార్ నాని…..!!

0
518

యువ హీరో ఆది సాయికుమార్ హీరోగా నైరా షా, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం బుర్రకథ. చిత్రంలో హీరోకు రెండు మెదళ్ళు కలిగి ఉండడం అనే సరికొత్త అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించాలని నాచురల్ స్టార్ నాని సినిమా యూనిట్ కు అల్ ది బెస్ట్ చెప్పారు. మనకు బుర్రకథ అంటే గుర్తొచ్చేది తందనే తానే అంటూ సాగె బుర్రకథ అని, అయితే ఇది అది కాదు, మనిషికి ఉండే బుర్రకథ అని, ఇక మనిషికి ఒక బుర్ర ఉంటేనే ఆలోచించడం కష్టం, అటువంటిది ఈ చిత్రంలో హీరో ఆదికి రెండు బుర్రలు ఉండడం అనే వినూత్న కథాంశంతో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు. కాగా ఈ బుర్రకథ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here