విభిన్న కథాంశంతో వినోదాత్మకంగా రూపొందిన ‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల చేసిన విక్టరీ వెంకటేష్…!!

0
156

ఆది సాయి కుమార్ హీరోగా ఒక విభిన్నమైన కథాంశంతో వినోదాత్మకంగా రూపొందిన సినిమా ‘బుర్రకథ’.  టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు, తొలి సారి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమా టీజర్, పాటలు  విడుదలై ఆకట్టుకున్నాయి. నేడు ఈ సినిమా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు . ‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు, కృష్ణుడి శత్రువు కంశుడు,నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ట్రైలర్ లో ఆది చెప్పే డైలాగ్ సినిమా కథాంశం ఎలా ఉండబోతోందో తెలిసేలా ఉంది.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా, సినిమా పై హైప్ పెంచే విధంగా సాగింది. ఆది కి తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ యాక్షన్, కామెడీ మేళవింపుతో ఆకట్టుకుంటోంది . ఈ చిత్రంలో ఆదికి జోడిగా మిస్తీ చక్రవర్తి నటిస్తుండగా, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.  దీపాల ఆర్ట్స్, టఫెన్డ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానెర్ల పై ఈ చిత్రాన్ని హెచ్‌.కె.శ్రీకాంత్‌ దీపాల, కిషోర్, ఎం వి కిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here