“కిల్లర్” సినిమా ఎంత క్వాలిటీగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ట్రైలర్ తోనే తెలుస్తోంది – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పవర్ డైరెక్టర్ హరీశ్ శంకర్
మా మూవీ సెకండాఫ్ లోని ట్విస్ట్ ఊహించి చెబితే కోటి రూపాయల బహుమతి ఇస్తాం – ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్
ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తున్న మూవీ
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. “కిల్లర్” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో “కిల్లర్” మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
చీఫ్ ఎడిటర్ బి.మనోజ్ కుమార్ మాట్లాడుతూ – పూర్వాజ్ గారి సినిమాలకు వర్క్ చేయడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. ఆయన సినిమాలు క్రియేటివ్ గా ఉంటాయి. ఆయన వర్క్ పరంగా చాలా ఫ్రీడమ్ ఇస్తారు. మా జ్యోతి గారు ఒక సోదరుడిలా చూసుకుంటారు. కిల్లర్ సినిమా మీ అందరినీ ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.
డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ – పూర్వాజ్ గారితో నేను వర్క్ చేస్తున్న రెండో చిత్రమిది. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. పూర్వాజ్ ఆలోచనలను తెరపైకి తీసుకొచ్చే క్రమంలో మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఈ సినిమాలో జ్యోతి గారు సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
యాక్టర్ చందు మాట్లాడుతూ – నేను మన మీడియా నుంచే వచ్చాను. మన మీడియా మిత్రుల సహకారం వల్లే ఈ వేదిక మీద ఉన్నాను. మీడియాలో, సినిమాల్లో కెరీర్ కొనసాగిస్తున్నాను. నటుడిగా ఏ సినిమాలు చేశావు అని అడుగుతుంటారు. అలా అడిగేవారికి కిల్లర్ మూవీ ఆన్సర్ గా నిలుస్తుంది. ఈ సినిమాతో మా డైరెక్టర్ పూర్వాజ్ గారికి, మా జ్యోతి గారికి మంచి పేరు, మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు వస్తాయని ఆశిస్తున్నా. అన్నారు.
యాక్టర్ గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ – పూర్వాజ్ గారు షూటింగ్ జరిపిన రోజే ఆ కంటెంట్ ఎడిటింగ్ చేస్తారు. ఇటీవల క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమా వచ్చింది. మా మూవీ ట్రైలర్ చూస్తే ఆ సినిమా గుర్తుకువచ్చింది. మీకు అలాంటి ఫీలే కలిగిందని భావిస్తున్నాను. జ్యోతి గారు ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. వాటిలో సియా అనే పాత్ర నాకు చాలా ఇష్టం. తను బాగా ఫైట్స్ చేస్తుంది. మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు ఈతరం అమ్మాయిలను జ్యోతి గారు ఇన్స్ పైర్ చేస్తారు. ఆరు పాత్రల్లో ఆమె పర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. అన్నారు.
ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి.ఎ. మాట్లాడుతూ – ఇంతమంది వేదిక మీద మాట్లాడుతున్నారంటే దాని వెనక దర్శకుడి కష్టం ఎంతగా ఉంటుందో నేను చూశాను. ఐదేళ్ల కిందట పూర్వాజ్ మమ్మల్ని కలిసి ఒక పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ చెప్పారు. కొత్త దర్శకుడు ఇలాంటి స్క్రిప్ట్ డీల్ చేయగలరా అనుకున్నాం. ఆ తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్ లు మా దగ్గరకు తీసుకొచ్చారు. మేము నమ్మిన ఒక కొత్త దర్శకుడు ఈ రోజు ఎదగడం చూస్తుంటే సంతోషంగా సంతృప్తిగా ఉంది. డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి కూడా మంచి పేరు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. మనం ఎదుగుతున్న క్రమంలో అనుకోకుండా కొందరిని మిస్ అవుతూ జర్నీ చేస్తుంటాం. కానీ తనతో ఉన్న అందరినీ కలుపుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు పూర్వజ్. అదీ ఆయన ప్రత్యేకత. గతంలో పూర్వాజ్ తో సినిమా చేసినప్పుడు కూడా ఆయన కథలు, కాన్సెప్ట్ ల కంటే దర్శకుడిగా ఆయన ప్రతిభనే ఎక్కువగా నమ్మాను. ఈ సినిమా కూడా పూర్వజ్ క్రియేటివ్ టాలెంట్ ను నమ్మి సినిమా చేశాను. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూశాను. మూవీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా మాకు మా టీమ్ కు మంచి సక్సెస్ ఇచ్చి మా కాంబినేషన్ ను ఇలా మందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – రెండేళ్ల క్రితం నవరాత్రుల సమయంలోనే ఈ స్క్రిప్ట్ తీసుకుని అమ్మవారి పలు దేవాలయాల్లో పూజలు చేసి స్టార్ట్ చేశాం. ఈ దసరాకు ట్రైలర్ రిలీజ్ చేసుకుంటున్నాం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. నేను చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఉన్నాను. కిల్లర్ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్థాయి సై – ఫై ఫిక్షన్ తో , ఆ తరహా స్క్రీన్ ప్లేతో చేసిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమా తెరకెక్కించిన పూర్వాజ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. పూర్వాజ్ విజన్ వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులు మా కిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు వావ్ అనుకుంటారు. మేము కోట్లు సంపాదించాలని చేసిన సినిమా కాదిది. ప్యాషన్ తో మూవీ చేశాం. సీరియల్స్ లో మిమ్మల్ని ఆకట్టుకున్నాను. సినిమాల్లో తను ఏం చేయబోతోంది అని అనుకుంటారు. అలా అనుకునేవాళ్లకు నా సమాధానం కిల్లర్. ఈ సినిమా చూసి నేను ఇండస్ట్రీలో ఉంటూ మిమ్మల్ని మెప్పించగలనా లేదా అనేది ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. ఈ సినిమాలో గ్లామర్ తో కాకుండా టాలెంట్ తో నన్ను మీరు గుర్తిస్తారని నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీ టీజర్ నే ట్రిక్కిగా చేశాం. ఆ టీజర్ లో జ్యోతి టెర్రరిస్ట్, హౌస్ వైఫ్, వ్యాంపైర్, స్పై, సూపర్ షీ వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించారు. టీజర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అప్పుడు వీఎఫ్ఎక్స్ వాళ్లు మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ లో మా సినిమా రిలీజ్ కావాలి. వీఎఫ్ఎక్స్ వల్ల ఏడాది ఆలస్యమైంది. క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకూడదని వెయిట్ చేశాం. టీజర్ లో ఉన్న ట్విస్ట్ లను కొనసాగిస్తూ ట్రైలర్ చేశాం. టీజర్ లో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా, ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ తో పాటు సైంటిస్ట్ గా పరిచయమయ్యా. టీజర్ లాగే మా ట్రైలర్ కూడా చాలా ట్విస్ట్స్ లతో టర్న్స్ తో ఉంటుంది. మీకు అర్థమైనట్లే అనిపించినా డీప్ గా ఒక అందమైన కథ ఉంటుంది. అందులో నుంచి ఒక్క షాట్ కూడా మేము చూపించలేదు. ప్రతి దర్శకుడు తమది కొత్త సినిమా అని, ఎప్పుడూ చూసి ఉండరనే అంటారు. నేనూ అదే చెబుతున్నా. నేను చెప్పడం కాదు ఈ నెల 30న మీరే థియేటర్స్ లో ఎక్సిపీరియన్స్ చేస్తారు. 2024, 25, 26 సంవత్సరాల నేపథ్యంతో మూడు డిఫరెంట్ లేయర్స్ ఉన్న కథతో ఈ సినిమా ఉంటుంది. జ్యోతి చేసిన అన్ని క్యారెక్టర్స్ ను తెరపై చూస్తున్నప్పుడు కొత్తగా ఫీల్ అవుతారు. జ్యోతి ఈ క్యారెక్టర్స్ మేకోవర్ కోసం, బాడీ లాంగ్వేజ్, పర్ ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డారు. జ్యోతి చేసిన అన్ని క్యారెక్టర్స్ ను సమ్మరైజ్ చేస్తూ ఆమె ఏలియనా, ప్రత్యేకమైన శక్తులు ఉన్న మహిళా, ఆమె ఎవరు అనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కథలో జరుగుతుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలుస్తుంది. ఆమె ఎవరు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటుంది. ఆ క్యారెక్టర్ లోని ట్విస్ట్ ఏంటనేది మీరు ఊహించలేరు. సెకండాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ ను ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు ఊహించి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్ కు పంపిస్తే ఆ పర్సన్ కు మా మూవీ సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయల బహుమతి అందిస్తాం. మీరు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేదు అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. మా సినిమా చూసిన మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కొత్త ప్రయత్నం చేశారని అంటారు. సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూసే ప్రేక్షకులు బాగా చేశారంటారు. కిల్లర్ సినిమా చూస్తూ మీరు థ్రిల్ ఫీల్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు. నేను ఈ సినిమాకు తీసిన రష్ 2.15 నిమిషాలు. సినిమా నిడివి 2 గంటలు. మా సినిమాకు మంచి బిజినెస్ అవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రైట్స్ అమ్ముడయ్యాయి. కన్నడతో పాటు తమిళంలోనూ మా మూవీ రిలీజ్ కాబోతోంది. ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యింది. రెండు ఓటీటీల నుంచి ఆఫర్స్ ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా మీరు గుండెల్లో దాచిపెట్టుకునేలా ఉంటుంది. మా మూవీలో నటించిన, లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అయినాబత్తిన దశరథ మాధవ్, లైన్ ప్రొడ్యూసర్ సీతారామ్ గారికి, మా డీవోపీ జగదీశ్, మా డీఐ టీమ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ కు..ఇలా మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చాక పూర్వాజ్ తో మాట్లాడుతూ సినిమా బడ్జెట్ ఎంత అయ్యింది అని అడిగాను. ఆయన బడ్జెట్ ఎంతో చెప్పారు. ఆయన చెప్పిన బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ సినిమా చేయడం గొప్ప విషయం. ట్రైలర్ లోనే సినిమా క్వాలిటీ ఎంత బాగుందో తెలిసిపోతోంది. పూర్వాజ్, జ్యోతి ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి అభిమానులు. వారి అభిమానమే నన్ను ఈ ఈవెంట్ కు వచ్చేలా చేసింది. పూర్వాజ్ మొదటి సినిమా కూడా ప్రొడ్యూసర్ పద్మనాభ రెడ్డి గారే చేశారు. ఈ సినిమాకు ఆయనకు బెస్ట్ విశెస్ అందిస్తున్నా. న్యూరో లింక్ కు సంబంధించిన నేపథ్యమున్న కథ ఇది. ఈ మధ్య ఎలాన్ మస్క్ న్యూరో లింక్ పై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ న్యూరో లింక్ సూపర్ షీని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది. డైరెక్టర్ పూర్వాజ్ మొదటి రెండు చిత్రాలు లాక్ డౌన్ లో రిలీజ్ అయ్యాయి. ఇది అతనికి మూడో సినిమా. అందరు దర్శకులకు మొదటి చిత్రంతోనే పేరు రావాలనే ఏం లేదు. నేను కూడా సక్సెస్ కోసం చాలా వెయిట్ చేశాను. ఈ సినిమాతో మీరు అనుకున్న గుర్తింపు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. మీ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది. మీరు పెట్టుకున్న బడ్జెట్ లో, వర్కింగ్ డేస్ బట్టి చూస్తే మంచి క్వాలిటీ సినిమా చేశారు. ట్రైలర్ లో ఆ క్వాలిటీ పర్పెక్ట్ గా కనిపించింది. కిల్లర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————-
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – అయినాబత్తిన దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )



