నేడు విడుదల కానున్న రాజశేఖర్ ‘కల్కి’ కొత్త ట్రైలర్ …!!

0
93

టాలీవుడ్ లో యాంగ్రీ హీరోగా పేరుగాంచిన రాజశేఖర్ నటిస్తున్న కొత్త చిత్రం కల్కి. ఇటీవల ‘అ’ అనే విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి, మంచి సక్సెస్ ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ‘కల్కి’ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు టీజర్, ట్రైలర్ చిత్రం పై ఆసక్తి రేకెత్తించి అంచనాలు పెంచాయి . ఈ చిత్ర హానెస్ట్ ట్రైలర్ ని నేటి మధ్యాహ్నం 2 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు.

1980వ దర్శకం నాటి కథగా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ మరోసారి పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. శివాని, శివాత్మిక మూవీస్ అలానే హ్యాపీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత సి కళ్యాణ్. రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధీష్, హరీష్ ఉత్తమన్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాశరధి శివేంద్ర కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here