‘కౌసల్య కృష్ణమూర్తి’ మొదటి పాట నేడే విడుదల….!!

0
119

ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త తరహా చిత్రాల రాక ఎక్కువ అయిందనే చెప్పాలి. ఇక ఆ విధంగా క్రికెట్ నేపథ్యంలో ఒక విభిన్న కథ మరియు కథనాలతో రూపొందుతున్న చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. కొద్దిరోజుల క్రితం తమిళం లో విడుదలై మంచి సక్సెస్ సాధించిన ‘కనా’ అనే చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకులు భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం జరిగింది. ఇక టీజర్ విడుదల తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

సంగీత దర్శకులు ధిబు నైనన్ థామస్ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘ముద్దబంతి’ అనే పల్లవితో సాగె తొలి పాటను నేడు సాయంత్రం 5గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనుంది చిత్ర బృందం. ఒక మంచి ఇంటరెస్టింగ్ పాయింటుతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ చిత్రం, రేపు విడుదల తరువాత తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ రాజు, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, తమిళ నటుడు శివకార్తికేయన్ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here