5 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఓ బేబీ’ ట్రైలర్….!!

0
104

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్స్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత అక్కినేని. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఓ బేబీ. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ , తేజ సజ్జ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ‘మిస్ గ్రానీ’ అనే ఒక కొరియన్ చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్, విపరీతమైన ప్రేక్షకాభిమానంతో ముందుకు సాగుతూ, నేటితో 5 మిలియన్ల వ్యూస్, లక్ష లైక్స్ సంపాదించి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. రేపు విడుదల తరువాత తమ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్.  ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించగా, సినిమాటోగ్రఫీని రిచర్డ్ ప్రసాద్ అందించారు. కాగా చిత్రాన్ని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here