యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న భీష్మ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నిన్న ప్రారంభోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకపొతే అయన హీరోగా నేడు మరొక సరికొత్త చిత్రం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఆయనకు జోడిగా స్టన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ జతకడుతోంది. ‘రంగ్ దే’ అనే టైటిల్ నిర్ణయించిన ఈ చిత్రానికి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి యూత్ ఫుల్ లవ్ స్టోర్స్ తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ అందిస్తున్నారు. చిత్రాన్ని 2020 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా అతిత్వరలో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం…..!!


