సాయిధరమ్ తేజ్, మారుతిల ప్రతిరోజు పండగే చిత్రం ప్రారంభం….!!

0
100

ఇటీవల విడుదలైన చిత్రలహరి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నేడు నూతన చిత్రాన్ని ప్రారంభించారు. వెరైటీ కథలను, ఎటెర్టైనింగ్ గా తెరకెక్కించగల దర్శకులు మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే టైటిల్ తో నేడు ఈ చిత్రం ప్రారంభమయింది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన గతంలో ఆయనతో కలిసి సుప్రీమ్ లో నటించిన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

నేడు మూవీ యూనిట్ సభ్యులు పూజా కార్యక్రమాలతో ముహూర్తపు షాట్ ని చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. ఒక ఆకట్టుకునే యూత్ ఫుల్ సబ్జెక్టు తో పాటు మంచి సామజిక అంశాన్ని కూడా చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోకి ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here