సక్సెస్ ఫుల్ గా 7వ వారంలోకి ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’

0
186

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి వంటి ముగ్గురు దిగ్గజ నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి. ఇటీవల మే9 న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లోకి అతి పెద్ద విజయాన్ని అందుకుంది, అంతేకాక సూపర్ స్టార్ మహేష్ కెరీర్ పరంగా కూడా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది. విడుదలై 6 వారాలు గడుస్తున్నా, చాలా చోట్ల స్టడీగా మంచి కలెక్షన్లతో ముందుగు సాగుతున్న మహర్షి, నేడు 7వ వారంలోకి అడుగుపెడుతోంది.

విడుదలై ఇన్నిరోజులు గడుస్తున్నా, సినిమాకు ఆదరణ ఇంకా తగ్గలేదంటే దానికి కారణం తమ సినిమా ప్రేక్షకులకు ఎంతో చేరువ అవ్వడమే అని, ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెపుతోంది మహర్షి చిత్ర యూనిట్. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here